Saturday, February 1, 2020

HIV/AIDS పై అవగాహన కార్యక్రమం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల - కనిగిరి
HIV/AIDS పై అవగాహన కార్యక్రమం
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కనిగిరిలో రెడ్ రిబ్బన్ క్లబ్ కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరఫున "హెచ్ఐవి మరియు ఎయిడ్స్" అనే అంశం మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ రామకృష్ణ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా KANIGIRI ICTC కౌన్సిలర్ శ్రీ పాలడుగు శ్రీనివాసరావు గారు, మాస్టర్ ట్రైనర్ గా కందుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి డాక్టర్ కే. శ్రీనివాసులు గారు పాల్గొని విద్యార్థులకి హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది ఎంత ప్రమాదకరమైన వ్యాధో, అది ఎన్ని రకాలుగా వ్యాపిస్తుంది, ఎయిడ్స్ యొక్క నివారణ చర్యలు, ఎయిడ్స్ వ్యాధి సోకినా వ్యక్తుల పట్ల సమాజం ఏ తీరున ప్రవర్తించాలి వంటి అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు మరియు యువకులు ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించుకొని ఈ వ్యాధి నివారణకై తమ వంతు కృషిచేయాలని, ఈ కార్యక్రమంలో తాము నేర్చుకున్న విషయాలను సమాజంలో ప్రచారం చేయాలని ఉద్ఘాటించారు. అదేవిధంగా కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్ తరఫున రక్తదానం, సమాజ సేవ, ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టి పది మందికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ నరేష్ రాజా మాట్లాడుతూ యువత తమ జీవితంలో మంచి నడవడికను ఎంచుకోవాలని, తద్వారా చెడు వ్యసనాలకు జోలికి పోకుండా తమ జీవితాన్ని మలుచుకోవాలని, నిరంతరం సమాజ సేవలో కృతకృత్యులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లో ఇతర అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈనాడు పత్రికలో ప్రచురితమైన వార్త

ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన వార్త
















No comments:

Post a Comment