స్థానిక కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి కళాశాల మాజీ ప్రధాన ఆచార్యులుగా పనిచేసిన డా||I.V. నాగరాజారావు గారు ప్రేరణ మరియు మార్గదర్శక ఉపన్యాసం ఇచ్చారు. చదువుకునే సమయంలో ఏ అంశాలపై పట్టు సాధించాలి, సమాజంలో ఎలా మెలగాలి, అవకాశాలను ఎలా అంది పుచ్చుకోవాలి, భవిశ్యత్తుకు ఎలా బాటలు వేసుకోవాలి వంటి అంశాలపై ఉపన్యసించారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీ డి.రామ కృష్ణారెడ్డి(I/C), శ్రీ రామకోటయ్య, శ్రీమతి శానాజ్ బేగం, శ్రీ నరేష్ రాజా, శ్రీ రంగయ్య, శ్రీ సాయి బ్రహ్మమ్, శ్రీ ఖాదర్ చందు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రసంగిస్తున్న డా||I.V. నాగరాజారావు
No comments:
Post a Comment