Saturday, November 30, 2019

కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తృతీయ స్ధానం

                జిల్లా వనరుల కేంద్రం (District Resource Center, Ongole) ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలోని టి.ఆర్.ఆర్(తిక్కవరపు రామి రెడ్డి) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మరియు ఎయిడెడ్ కళాశాలలకు *జిల్లా స్ధాయి క్విజ్* పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో *కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల* విద్యార్థులు పాల్గొని తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాగా టి.ఆర్.ఆర్ ప్రభుత్వ కళాశాల మొదటి, యర్రగొండపాలెం ప్రభుత్వ కళాశాల ద్వితీయ స్థానాలు పొందాయి. ఈ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డా||పి.వెంకటేశ్వర్లు, అధ్యాపకులు శ్రీ రామకృష్ణారెడ్డి, శ్రీమతి షేక్ షానాజ్ బేగం, శ్రీ రామకోటయ్య, శ్రీ నరేష్ రాజా మరియు శ్రీ రంంగయ్య లు అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. 







7 comments: