Sunday, December 15, 2019

పొట్టి శ్రీరాములు వర్ధంతి సభ

      స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సభ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా గా శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని తెలుగు వారి కోసం సాధించిన తీరుని మరియు త్యాగాన్ని గుర్తు చేసుకుని వారిని స్మరించుకోవడం జరిగింది. పొట్టి శ్రీరాములు మద్రాసు (ప్రస్తుత చెన్నై)లోని జార్జిటౌన్, అన్నాపిళ్లై వీధిలోని 163వ నెంబరు ఇంటిలో 1901 మార్చి 16వ తేదీన పుట్టారు. తండ్రి గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. శ్రీరాములు పూర్వీకుల స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని పడమటిపల్లె గ్రామం. అప్పట్లో కనిగిరి, పడమటిపల్లి.. నెల్లూరు జిల్లాలో ఉండేవి.


సభని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రామ కృష్ణా రెడ్డి గారు మరియు కళాశాల ఇతర అధ్యాపకులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను స్ఫూర్తిని అదేవిధంగా స్వతంత్ర సాధనలో వారి కృషిని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో వారి త్యాగనిరతిని కొనియాడారు. శ్రీరాములు గారి స్ఫూర్తినే తీసుకుని విద్యార్థులు కూడా తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో లో శ్రీ రామకృష్ణ రెడ్డి, శ్రీమతి ఇ షేక్ షా నాజ్ బేగం, శ్రీ రామ కోటయ్య, శ్రీ శ్రీ కె నరేష్ రాజా, శ్రీ ఖాదర్ చందు మరియు విద్యార్థులు మరియు అధ్యాపకేతర బృందం పాల్గొని సభను విజయవంతం చేశారు.











No comments:

Post a Comment