Thursday, February 13, 2020

ఘనంగా కళాశాల వార్షికోత్సవం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల - కనిగిరి లో 13 ఫిబ్రవరి 2020 న కళాశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రామకృష్ణ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రమేష్ చంద్రారెడ్డి గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ ప్రకాష్ రావు గారు మరియు కళాశాల పూర్వ వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు శ్రీ వసంతరావు గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కళాశాలలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను గురించి తెలియజేస్తూ కళాశాలలో నిత్యం జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకానికి దాతలుగా వ్యవహరించిన శ్రీ రాఘవాచారి గారిని, శ్రీ ప్రకాష్ రావు గారిని, బీకాం కంప్యూటర్స్ కోర్సుకు సంబంధించి అప్లికేషన్ ఫీజు అందించిన శ్రీ రాచమల్లు శ్రీనివాసులు రెడ్డి గారిని, విద్యార్థుల ఫీజులను చెల్లించిన కేటీఆర్ విద్యాసంస్థల అధినేత కుందురు తిరుపతి రెడ్డి గారిని, విద్యార్థుల బస్ పాసులు కి సహాయాన్ని అందించిన శ్రీ దిలీప్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సేవా దృక్పధాన్ని అభినందించారు. 

వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైన కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ రమేష్ చంద్రారెడ్డి గారు మాట్లాడుతూ కళాశాల పూర్వ వైభవాన్ని విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా ప్రకాష్ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం మంచి నడవడిక నైతిక విలువలు పాటిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వసంతరావు గారు ప్రసంగిస్తూ విద్యార్థులు చక్కగా చదువుకుని కళాశాలకి మరియు తమ తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేశారు.

తదనంతరం కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ డి. రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కళాశాల యొక్క విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కళాశాల యాజమాన్యం చేస్తున్న కృషిని విద్యార్థులకు తెలియజేశారు. ప్రతిగా విద్యార్థులు, ముఖ్య అతిథులు మరియు దాతలు తమ వంతు సాయం చేయడానికి కూడా సహకరిస్తామని తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మరిచిపోని అధ్యాయంగా ఉంటుందని ప్రిన్సిపాల్ సభను ఉద్దేశించి అన్నారు. 

ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు శానం వెంకటేశ్వర్లు, పల్నాటి నరసింహులు, కొండేపోగు వినోష్ బాబు ప్రసంగిస్తూ శ్రీ శ్రీ కవితలు, మహాభారతం మరియు నిజజీవిత సంఘటనలు ఉటంకిస్తూ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. కళాశాల అభివృద్ధి లో తమ వంతు పాత్ర పోషించడానికి ప్రత్యేక తీసుకున్నారు.  

ఈ కార్యక్రమంలో మరో అరుదైన సంఘటన ఏమిటంటే కళాశాలకి గత నాలుగు దశాబ్దాలుగా నిర్విరామంగా తన సేవలను అందిస్తున్న ప్రక్షాళన సేవకులు (Sweeper) శ్రీ నగిరి కంటి మస్తాన్ గారిని కళాశాల యాజమాన్యం మరియు ముఖ్య అతిధులు సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు అధ్యాపకులు శ్రీమతి షేక్ షణాజ్ బేగం, చరిత్ర అధ్యాపకులు శ్రీ రామ కోటయ్య గారు, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు శ్రీ నరేష్ రాజా గారు, ఆంగ్ల అధ్యాపకులు శ్రీ రంగయ్య గారు, వాణిజ్యశాస్త్రం అధ్యాపకులు శ్రీ సాయి బ్రహ్మంగారు, కళాశాల యు డి సి శ్రీ ఖాదర్ చందు గారు, క్లర్క్ శ్రీ శ్రీనివాసులు గారు మరియు విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. 


 ఈనాడు పత్రికలో వచ్చిన వార్త
సాక్షి పత్రిక లో వచ్చిన వార్త










































2 comments: