ప్రభుత్వ డిగ్రీ కళాశాల కనిగిరిలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 25, 2020న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భారతదశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. విద్యార్థులకు అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ని ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలో అదేవిధంగా ప్రజాస్వామ్యంలో మరియు పరిపాలన లో భాగస్వాములు కావాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ డి.రామకృష్ణారెడ్డి, తెలుగు ప్రధాన ఉపన్యాసకురాలు శ్రీమతి షేక్ షానాజ్ బేగం, ఆంగ్ల ఉపన్యాసకులు శ్రీ రంగయ్య మరియు అధ్యాపకేతర విద్యార్థి బృందం పాల్గొన్నారు.
No comments:
Post a Comment