Friday, January 3, 2020

జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ మరియు సావిత్రిబాయి ఫూలే జన్మదినోత్సవ వేడుకలు 03/01/2020

    స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీమతి షేక్ షానాజ్ బేగం ప్రసంగిస్తూ సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి, స్త్రీ విద్యకు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన కృషిని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు ప్రసంగిస్తూ సాంఘిక దురాచారాలు తారా స్థాయిలో ఉన్న కాలంలో ముందుకు వచ్చి సాంఘిక దురాచారాలను ఖండిస్తూ, బాలిక విద్యను, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహిస్తూ, బాలికలకు ప్రత్యేక పాఠశాలను స్థాపించి, ఆమె చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. అలాంటి మహిమాన్విత మహిళ జన్మదినోత్సవాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం, ఇదే రోజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా జరపడం అభినందనీయం. ఈ కార్యక్రమంలో చరిత్ర ఉపన్యాసకులు శ్రీ రామ కోటయ్య, రాజనీతి శాస్త్ర ఉపన్యాసకులు శ్రీ నరేష్ రాజా, ఆంగ్ల ఉపన్యాసకులు శ్రీ రంగయ్య, విద్యార్థులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న చరిత్ర అధ్యాపకులు శ్రీ.రామకోటయ్య

కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలుగు ఉపన్యాసకులు శాణాజ్ బేగం

కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు మరియు విద్యార్థులు

కార్యక్రమంలో మొక్కని నాటుతున్న అధ్యాపకులు మరియు విద్యార్థులు

No comments:

Post a Comment