Monday, January 27, 2020

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

              ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కనిగిరిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ శ్రీ డి. రామకృష్ణారెడ్డి గారు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం మాట్లాడుతూ భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఎలా అవతరించింది, రాజ్యాంగ అమలు ఎలా జరుగుతుంది, రాజ్యాంగంలోని విధులను పాటిస్తూ హక్కుల ని ఎలా ఉపయోగించుకోవాలి తదితర అంశాలను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీ రామకృష్ణ రెడ్డి, శ్రీమతి షనాజ్ బేగం, శ్రీ రామ కోటయ్య, శ్రీ రంగయ్య, శ్రీ నరేష్ రాజా, శ్రీ సాయి బ్రహ్మం, శ్రీ ఖాదర్ చందు, శ్రీమతి శోబా విన్నీ మరియు యు.వి విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

















జాతీయ ఓటర్ల దినోత్సవం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల కనిగిరిలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 25, 2020న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భారతదశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. విద్యార్థులకు అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ని ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలో అదేవిధంగా ప్రజాస్వామ్యంలో మరియు పరిపాలన లో భాగస్వాములు కావాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ డి.రామకృష్ణారెడ్డి, తెలుగు ప్రధాన ఉపన్యాసకురాలు శ్రీమతి షేక్ షానాజ్ బేగం, ఆంగ్ల ఉపన్యాసకులు శ్రీ రంగయ్య మరియు అధ్యాపకేతర విద్యార్థి బృందం పాల్గొన్నారు.














Friday, January 3, 2020

జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ మరియు సావిత్రిబాయి ఫూలే జన్మదినోత్సవ వేడుకలు 03/01/2020

    స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీమతి షేక్ షానాజ్ బేగం ప్రసంగిస్తూ సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి, స్త్రీ విద్యకు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన కృషిని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు ప్రసంగిస్తూ సాంఘిక దురాచారాలు తారా స్థాయిలో ఉన్న కాలంలో ముందుకు వచ్చి సాంఘిక దురాచారాలను ఖండిస్తూ, బాలిక విద్యను, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహిస్తూ, బాలికలకు ప్రత్యేక పాఠశాలను స్థాపించి, ఆమె చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. అలాంటి మహిమాన్విత మహిళ జన్మదినోత్సవాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం, ఇదే రోజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా జరపడం అభినందనీయం. ఈ కార్యక్రమంలో చరిత్ర ఉపన్యాసకులు శ్రీ రామ కోటయ్య, రాజనీతి శాస్త్ర ఉపన్యాసకులు శ్రీ నరేష్ రాజా, ఆంగ్ల ఉపన్యాసకులు శ్రీ రంగయ్య, విద్యార్థులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న చరిత్ర అధ్యాపకులు శ్రీ.రామకోటయ్య

కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలుగు ఉపన్యాసకులు శాణాజ్ బేగం

కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు మరియు విద్యార్థులు

కార్యక్రమంలో మొక్కని నాటుతున్న అధ్యాపకులు మరియు విద్యార్థులు