Wednesday, December 18, 2019

జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు : ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కనిగిరి


                        ప్రకాశం జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సంబంధించిన డి.ఆర్.సి కార్యక్రమం:2019 (DRC Programme-2019)క్రింద నిర్వహించ బడుతున్న కార్యక్రమాలలో భాగంగా  వ్యాసరచన పోటీలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కనిగిరిలో  18/12/2019  తేదీన జరిగాయి.

వ్యాసరచన పోటీలు:  తెలుగు మాధ్యమం
1. జీవరాశి పై పర్యావరణ క్షీణతా ప్రభావాలు.

Essay Writing Competition English Medium
1. Social Media pros and cons and its effects on society.

                  ఈ వ్యాసరచన పోటీలో  ఆంగ్ల విభాగము నందు టి.ఆర్ఆ.ర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కందుకూరు విద్యార్థిని P. అనూష  ప్రథమ స్థానం పొందగా, తెలుగు విభాగము నందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కనిగిరికి చెందిన విద్యార్థి పి.నరసింహులు ప్రథమ స్థానంలో నిలిచారు. అనంతరం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ D. రామకృష్ణారెడ్డి , DRC కోఆర్డినేటర్ నరేష్ రాజా, చరిత్ర ఉపన్యాసకులు రామకోటయ్య, మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది వ్యాసరచన పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులను అభినందించారు.
Winners in Telugu Essay Writing-Top 3 Positions
1. P.Narasimhulu      - I-BA, GDC-Kanigiri.
2. B.Pavitra.              - II-BA,TRRGDC-Kandukur
3, S.Venkateswarlu. - III-BA, GDC-Kanigiri.

Winners in English Essay Writing-Top 3 Positions
1. S.Anusha.             - III-BA, TRRGDC-Kandukur.
2. K.Vinosh Babu.    - II-BA (GDC-Kanigiri)
3. M.Durga Prasad  - II-BA, TRRGDC, Kandukur.




వ్యాసరచన పోటీలను పర్యవేక్షిస్తున్న రామకృష్ణారెడ్డి

ఈ కార్యక్రమ పర్యవేక్షణలో అధ్యాపకులు

విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న చరిత్ర ఉపన్యాసకులు రామకోటయ్య 

విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రిన్సిపల్ డి.రామకృష్ణారెడ్డి

ఆంగ్ల విభాగంలో ప్రథమ స్థానం పొందిన పి.అనూష

ఆంగ్ల మాధ్యమంలో ద్వితీయ స్థానం పొందిన కె.వినోష్ బాబు

 ఆంగ్ల మాధ్యమంలో తృతీయ స్థానం పొందిన దుర్గాప్రసాద్

తెలుగు మాధ్యమంలో ప్రథమ స్థానం సాధించిన పి.నరసింహులు

తెలుగు మాధ్యమంలో ద్వితీయ స్థానం సాధించిన బి.పవిత్ర

తెలుగు మాధ్యమంలో తృతీయ స్థానం సాధించిన ఎస్. వెంకటేశ్వర్లు

విజేతలతో కళాశాల అధ్యాపక బృందం

అధ్యాపక బృందంతో కళాశాల విద్యార్థులు




Sunday, December 15, 2019

పొట్టి శ్రీరాములు వర్ధంతి సభ

      స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సభ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా గా శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని తెలుగు వారి కోసం సాధించిన తీరుని మరియు త్యాగాన్ని గుర్తు చేసుకుని వారిని స్మరించుకోవడం జరిగింది. పొట్టి శ్రీరాములు మద్రాసు (ప్రస్తుత చెన్నై)లోని జార్జిటౌన్, అన్నాపిళ్లై వీధిలోని 163వ నెంబరు ఇంటిలో 1901 మార్చి 16వ తేదీన పుట్టారు. తండ్రి గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. శ్రీరాములు పూర్వీకుల స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని పడమటిపల్లె గ్రామం. అప్పట్లో కనిగిరి, పడమటిపల్లి.. నెల్లూరు జిల్లాలో ఉండేవి.


సభని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రామ కృష్ణా రెడ్డి గారు మరియు కళాశాల ఇతర అధ్యాపకులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను స్ఫూర్తిని అదేవిధంగా స్వతంత్ర సాధనలో వారి కృషిని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో వారి త్యాగనిరతిని కొనియాడారు. శ్రీరాములు గారి స్ఫూర్తినే తీసుకుని విద్యార్థులు కూడా తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో లో శ్రీ రామకృష్ణ రెడ్డి, శ్రీమతి ఇ షేక్ షా నాజ్ బేగం, శ్రీ రామ కోటయ్య, శ్రీ శ్రీ కె నరేష్ రాజా, శ్రీ ఖాదర్ చందు మరియు విద్యార్థులు మరియు అధ్యాపకేతర బృందం పాల్గొని సభను విజయవంతం చేశారు.











Wednesday, December 11, 2019

CAREER GUIDANCE LECTURE BY DR.I.V.NAGARAJARAO

  స్థానిక కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి కళాశాల మాజీ ప్రధాన ఆచార్యులుగా పనిచేసిన డా||I.V. నాగరాజారావు గారు ప్రేరణ మరియు మార్గదర్శక ఉపన్యాసం ఇచ్చారు. చదువుకునే సమయంలో ఏ అంశాలపై పట్టు సాధించాలి, సమాజంలో ఎలా మెలగాలి, అవకాశాలను ఎలా అంది పుచ్చుకోవాలి, భవిశ్యత్తుకు ఎలా బాటలు వేసుకోవాలి వంటి అంశాలపై ఉపన్యసించారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీ డి.రామ కృష్ణారెడ్డి(I/C), శ్రీ రామకోటయ్య, శ్రీమతి శానాజ్ బేగం, శ్రీ నరేష్ రాజా, శ్రీ రంగయ్య, శ్రీ సాయి బ్రహ్మమ్, శ్రీ ఖాదర్ చందు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


                 ప్రసంగిస్తున్న డా||I.V. నాగరాజారావు